మొబైల్ ఫోన్ ధరలను తగ్గించడానికి జియో రియల్‌మేతో కలిసి పనిచేస్తుంది
By: chandrasekar Sat, 12 Dec 2020 10:40 PM
దేశంలో మొబైల్ ఫోన్ ధరలను
తగ్గించడానికి జియో రియల్‌మేతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి
తెలిపారు. ఇప్పుడు వున్న 4 జి హ్యాండ్‌సెట్‌లు, ఇతర మొబైల్ పరికరాల ధరను
మరింత తగ్గించడానికి రిలయన్స్ జియో మరియు రియల్‌మే తో కలిసి పనిచేస్తున్నట్లు
కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. మొబైల్ ను సరసమైన ధరలకు అందించాల్సిన అవసరం
ఉందని తద్వారా 2 జి హ్యాండ్‌సెట్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులు 4 జి
మరియు 5 జికి
అప్‌గ్రేడ్ చేయవచ్చుని తెలిపారు.
జియో మొబైల్ ఫోన్
విభాగాన్ని మాత్రమే కాకుండా ఇతర కనెక్ట్ చేసిన పరికరాల్లో కూడా పనిచేస్తుందని ఆయన
అన్నారు. రియల్‌మే సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ భవిష్యత్తులో 5 జీ
స్మార్ట్‌ఫోన్ గరిష్ట సంఖ్యలో తీసుకురావడంలో చిప్‌సెట్‌లు ముఖ్య పాత్ర పోషించాయని
ఆయన అన్నారు. మేము భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 5 జికి
బాటలో పయనిస్తున్నామని మరియు మీడియాటెక్
చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం మేము
హార్డ్వేర్ ప్రొవైడర్లుగా ఉన్నాము. పరికరాల సాంకేతిక అంశాలతో రాజీ పడకుండా వారి
ధరలకు సరిపోయే 5 జి
పరికరాలు గరిష్ట సంఖ్యలో ప్రజలకు లభించేలా చూస్తామని చెప్పారు. మొబైల్ తో బాటు
మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్ మరియు వెహికల్ ఆటోమేషన్ వంటి పోకడలను కూడా
పరిశీలిస్తున్నామని మరియు ఈ సాంకేతికతలు 5 జితో
కలిసి ఒక మంచి జీవనశైలి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు.