Advertisement

  • బులియన్ మార్కెట్ లో పెరిగిన బంగారం ధర మరియు తగ్గిన వెండి ధర

బులియన్ మార్కెట్ లో పెరిగిన బంగారం ధర మరియు తగ్గిన వెండి ధర

By: chandrasekar Thu, 11 June 2020 8:20 PM

బులియన్ మార్కెట్ లో పెరిగిన బంగారం ధర మరియు తగ్గిన వెండి ధర


బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. హైదరాబాద్ లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయలు పెరగడంతో రూ.44,470కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 90 రూపాయలు పెరిగింది. దీంతో 48,510 రూపాయలకు చేరింది.

వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 40 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దిగి కేజీ వెండి ధర 47,400 రూపాయలకు చేరుకుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 45,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల తో 46,400 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 40 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర రూ.47 వేల మార్కుకు దిగి వచ్చి రూ.47,400గా ఉంది.

Tags :
|

Advertisement