Advertisement

పేటీఎం కస్టమర్లకు తీపికబురు.... ఎందుకో తెలుసా..?

By: Anji Tue, 24 Nov 2020 07:03 AM

పేటీఎం కస్టమర్లకు తీపికబురు.... ఎందుకో తెలుసా..?

డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. పోస్ట్‌పెయిడ్ సర్వీస్ (పేటీఎం పోస్ట్‌పెయిడ్) యూజర్లు వారి నెలవారీ బిల్లును ఇకపై సులభ ఈఎంఐ రూపంలో మార్చుకోవచ్చు.

అంతేకాకుండా తక్కువ వడ్డీ రేట్లతోనే ఈ బెనిఫిట్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు బిల్ ఈఎంఐ ఫీచర్ ద్వారా వారి ఖర్చులను తక్కువ వడ్డీ రేట్లతోనే ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.

సాధారణంగా పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వారి బిల్లు జనరేట్ అయిన తర్వాత వారం రోజుల్లో ఆ బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు పేటీఎం కొత్త సర్వీసులు తీసుకురావడంతో కస్టమర్లు వారి బిల్లు మొత్తాన్ని ఈఎంఐలోని మార్చుకోవచ్చు.

ఇకపోతే పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కస్టమర్లకు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తోంది. దీని ద్వారా యూజర్లు వారికి నచ్చిన ప్రొడక్టులు కొనుగోలు చేయొచ్చు.

పేటీఎం పోస్ట్‌పెయిడ్‌లో మూడు రకాలు ఉంటాయి. పోస్ట్‌పెయిడ్ లైట్ యూజర్లు రూ.20,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందుతారు.

క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు.

Tags :

Advertisement