Advertisement

Good News: భారీగా తగ్గిన బంగారం ధర...!

By: Anji Sat, 12 Dec 2020 08:25 AM

Good News: భారీగా తగ్గిన బంగారం ధర...!

బంగారం ధర పడిపోయింది. పసిడి ధర నేలచూపులు చూస్తోంది. తగ్గుతూనే ఉంది. బంగారం ధర గత రెండు రోజులు క్షీణించింది.

పసిడి ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగానే పడిపోయింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గత రెండు రోజుల్లో తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 దిగొచ్చింది. రూ.50,070కు క్షీణించింది.

అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 క్షీణతతో రూ.45,900కు తగ్గింది. ఇకపోతే ఈరోజు బంగారం ధర నిలకడగానే ఉంది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత రెండు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.2,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,800కు క్షీణించింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మాత్రం వెండి రేటు స్థిరంగా ఉంది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Tags :

Advertisement