భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... ఒక్కో సిలిండర్ పై రూ.50..!
By: Anji Wed, 02 Dec 2020 8:17 PM
సామాన్యులపై చమురు కంపెనీలు పగ బట్టాయి. ఇప్పటికే పెట్రోల్, డిజీల్ ధరల పెంపుతో వినియోగదారులను బాదుతుండగా.. ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై పడ్డాయి.
రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంచాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
మరోవైపు పెట్రోల్ రేట్లలాగే దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా సిలిండర్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా..
తాజా పెంపుతో రూ.696.5కు చేరుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు ధర రూ.594 ఉంటే.. అది రూ.644కు పెరగనుంది.
Tags :