మరో సారి అమ్మో.. అనిపిస్తున్న వంట గ్యాస్...!
By: Anji Wed, 16 Dec 2020 1:16 PM
ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజలు గ్యాస్ ధర భారీగా పెరుగుతుండడం తో మరింతం భారం అవుతుంది.
డిసెంబర్ 2 న వంట గ్యాస్ ధర రూ. 50 పెరుగగా..ఇప్పుడు మరోసారి రూ .50 పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు సంస్థలు.
14.2 కేజీల సిలిండర్ ధర రూ. 50 పెరుగగా, 5 కేజీల చిన్న సిలిండర్ ధర రూ. 18 పెరిగింది. 19 కేజీల సిలిండర్ ధర రూ. 36.50 పెరిగింది.
రాయితీ సిలిండర్ ధరలు పెరగడంతో.. ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 644కు చేరగా, కోల్‌కతాలో రూ. 670.50, ముంబైలో రూ. 644, చెన్నైలో రూ. 660కు చేరింది.
Tags :