Advertisement

  • ఫెయిర్ అండ్ లవ్లీ పై విమర్శలు గుప్పించిన ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్

ఫెయిర్ అండ్ లవ్లీ పై విమర్శలు గుప్పించిన ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్

By: Sankar Fri, 03 July 2020 4:20 PM

ఫెయిర్ అండ్ లవ్లీ పై విమర్శలు గుప్పించిన ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జి ప్లాయిడ్ హత్య అనంతరం ప్రపంచ వ్యాప్తంగా చెలరేగిన నిరసనల వలన అనేక కంపెనీలు తెల్లగా అవ్వడానికి మా ఉత్పత్తులను వాడండి అనడం మానేస్తున్నాయి ..దీనితో ఇప్పటిదాకా ఫెయిల్ అండ్ లవ్లీ అన్న పేరుతో బ్యూటీ ప్రోడక్ట్ మార్కెట్ లో సేల్ చేస్తున్న యూనీలీవర్ తాజాగా ఫెయిర్ స్థానంలో గ్లో అన్న పదాన్నీ తీసుకొచ్చింది ..

అయితే ఇప్పుడు ఆ గ్లో గా మార్చడంపై సౌందర్య సాధనాల తయారీ సంస్థలు హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), ఇమామీల మధ్య చిచ్చురేగింది. ‘గ్లో అండ్ హ్యాండ్‌సమ్’ పేరు తమ ప్రొడక్ట్స్‌ను పోలి వున్నందున హెచ్‌యూఎల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఇమామీ హెచ్చరించింది.

హెచ్‌యూఎల్ కంటే ముందే తాము ఉత్పత్తి చేస్తున్న పురుషుల ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు ‘ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్’ అని పేరు పెట్టినట్టు ఇమామీ చెబుతోంది. ‘‘హెచ్‌యూఎల్ నిర్ణయంతో మాకు షాక్ అనిపించినప్పటికీ.. ఆ కంపెనీ చేసే అన్యాయమైన వ్యాపారం మాకు తెలుసుకాబట్టి ఆశ్చర్యం కలగలేదు..’’ అంటూ ఇమామీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత సౌందర్య సాధనాల పేర్లపై విమర్శలు రావడంతో ఫెయిర్ అండ్ లవ్లీ పేరును ‘గ్లో అండ్ లవ్‌లీగా’ మార్చుతున్నట్టు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement