ఏడాది కాల పరిమితితో బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్
By: Sankar Wed, 09 Dec 2020 6:29 PM
ఒకప్పుడు ఫోన్ లో మాట్లాడాలి అంటే బాలన్స్ చాల ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉండేది ..అయితే రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత టారిఫ్ రేట్లు తగ్గుతూ వచ్చాయి ..ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ప్లస్ కాలింగ్ రెండు ఒకేదానిలో అత్యంత చౌకగా దొరకడం ప్రారంభం అయింది...
ఇప్పుడు తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఏడాది కాలపరిమితితో కూడిన రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఏపీ, అసోం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు లాంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్ కింద రెండు నెలల పాటు పలు ఉచితంగా పలు ఆఫర్లను అందిస్తున్నది. వీటిలో రోజుకు 250 నిమిషాల పాటు వాయిస్ కాల్‌తోపాటు 2జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. రోజులో 2జీబీ డాటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 80 కేబీపీఎస్‌లకు పడిపోనున్నది. ఇవి కేవలం తొలి రెండు నెలల మాత్రమే లభించనుండగా, మిగతా 10 నెలల పాటు ఎలాంటి ఆఫర్లు లేవు