లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్
By: Dimple Wed, 15 July 2020 6:34 PM
నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 36333 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 10698 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్, మెటల్, ఐటీ, ఫైనాన్స్, అటో రంగ షేర్లు లాభపడుతున్నాయి.
ఇన్ఫోసిస్, బంధన్‌బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌తో పాటు 53 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. అలాగే నేడు రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశం ఉంది.
ఈ పరిణామాలకు తోడు స్టాక్ ఆధారిత ట్రేడింగ్ సూచీల గమనానికి కీలకం కానుంది.
కోవిడ్-19 కట్టడికి ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తున్న వార్తలతో మంగళవారం యూఎస్ మార్కెట్లు 2-1 శాతం చొప్పున ముందంజ వేశాయి.
మోడర్నా వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది.
యాక్సిస్
బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 2శాతం నుంచి 10శాతం లాభపడ్డాయి.ఐటీసీ, గెయిల్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యూపీఎల్ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.