శీతాకాలం లో పొడి చర్మ నివారణకు చిట్కాలు
By: Sankar Wed, 09 Dec 2020 7:19 PM
శీతాకాలంలో చర్మం అంత పొడిగా మారి పగుళ్లు వచ్చి నొప్పిగా ఉంటుంది... శీతాకాలంలో పొడి చర్మం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి
1. డ్రై స్కిన్ నుండి రిలీఫ్ పొందటానికి మాయిశ్చరైజర్ అవసరం. మాయిశ్చరైజ్ చేయడాన్ని మీ రొటీన్ లో భాగం చేసుకోండి. అలాగే, బయటకు వెళ్తున్నప్పుడు సన్‌స్క్రీన్ ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయండి.
2. చలికాలం లో ఒంటికి పట్టినట్లు ఉండే బట్టలు వేసుకుంటాం చలికి తట్టుకోడానికి. కానీ, అవి పడకపోతే హఠాత్తుగా డ్రై స్కిన్ సమస్య రావచ్చు. అలాంటప్పుడు కొద్దిగా లూజ్ గా ఉండే బట్టలే వేసుకోండి.
3.చలికాలంలో పెదాలు బాగా పగిలినట్లు అయి ఇబ్బంది పెడతాయి ..అందుకే లిప్ బామ్ వాడటం వలన దాని నుంచి ఉపశమనం పొందవచ్చు..
4. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అందుకే మరీ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి..
5. కొబ్బరి నూనె వల్ల స్కిన్ స్మూత్ గా హైడ్రేటెడ్ గా తయారవుతుంది. కొబ్బరి నూనెని రోజూ వాడవచ్చు.