Advertisement

చర్మం పై ట్యాన్ తొలగించే సహజ పద్ధతులు

By: Sankar Mon, 29 June 2020 2:20 PM

చర్మం పై ట్యాన్ తొలగించే సహజ పద్ధతులు



బాగా ఎండల్లో తిరగడం వలన మన చర్మం పై ట్యాన్ పెరిగిపోతుంది.పార్లర్కు వెళ్తే మనీ చాల ఎక్కువగా అయితాయి .. అందుకే కొన్ని సహజ పద్ధతుల్లో ఆ ట్యాన్ ను తొలగించుకొని మళ్ళీ మన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ..ఇప్పుడు ఆ సహజ చిట్కాలు ఏవో చూదాం ..

1 నిమ్మరసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత‌ కణాలను, ట్యాన్‌ను తొలిగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి మనమేం చేయాలంటే.. బాగా మగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని దానిలోని గింజలను తీసేయాలి. దీంతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరింత ఎక్కువ సమయం రుద్దుకోవాలి. రుద్దడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేయాలి.

ఆపై నూనెతో ముఖాన్ని రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకొంటున్నప్పుడు చర్మంపై పేరుకొన్న మురికి, మృత‌ కణాలు, మట్టి వదిలిపోతాయి. ఆ తర్వాత చర్మం పూర్తిగా శుభ్రం కావడంతో.. అది అందంగా మెరిసిపోతుంది. మీరు నిమ్మరసాన్ని మొదటిసారిగా చర్మానికి రాసుకొంటున్నట్లయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. గడ్డం దగ్గర కొద్దిగా నిమ్మరసం రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత కూడా.. మీకు ఏమీ ఇబ్బందిగా అనిపించకపోతే మీరు ఈ చిట్కాను పాటించవచ్చు.

2.బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. ఇవి చర్మమృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.బాగా మగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

3.నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి ట్యాన్‌ను పోగొట్టి చర్మాన్నిమెరిపిస్తాయి. దీనికి రోజ్ వాటర్, కీర దోస రసం కూడా కలిపితే.. ఎండలో వాడిపోయినట్లుగా తయారైన చర్మానికి తిరిగి జీవకళ అందుతుంది. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను సైతం తగ్గిస్తుంది.టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, కీర దోస రసం, రోజ్ వాటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.








Tags :
|

Advertisement