Advertisement

ఈ చిట్కాలు వాడితే దంతాలు తెల్లగా మెరుస్తాయి

By: Sankar Wed, 26 Aug 2020 4:43 PM

ఈ చిట్కాలు వాడితే దంతాలు తెల్లగా మెరుస్తాయి


ఎదుటివారు మనల్ని చూడగానే ఆకర్షించేది నవ్వు.. పళ్లవరుస అందంగా ఉంటే నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. అయితే, దంతాలు ఎల్లపుడు తెల్లగా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటించాలి

1. అరటిపండు తొక్కని పండ్లపై ఒకనిమిషం పాటు రుద్దితే అందులోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మలినాలను తొలగించి పళ్లని తెల్లగా మారిస్తాయి. అదే విధంగా వంటసోడా కూడా పళ్లని తెల్లగా మారుస్తాయి. నిమ్మతొక్కని వంటసోడాకి అద్ది రాయడం వల్ల పళ్లు మెరుస్తాయి..

2. తాజా క్యారెట్లని కొరికి తింటే దంతాల మీద బ్యాక్టీరియా తొలిగిపోయి తెల్లగా మారడమే కాకాకుండా చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

3. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి.

4. అలాగే స్ట్రాబెర్రీలూ ఇందుకూ తోడ్పడుతాయి. దోరగా లేదా పండిన స్ట్రాబెర్రీల్లో మాలిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలని మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పళ్లపై మరకలకి కారణమైన బ్యాక్టీరియాని అదుపు చేస్తాయి. చిగురు వాపు రాకుండా నివారిస్తాయి..

5. చక్కని పోషకాలు నిండిన కాలీఫ్లవర్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటూ దంతాలనీ చక్కగా మెరిపిస్తుంది..

6. పెరుగూ, జున్నూ కూడా దంతాలని మెరిపిస్తాయి. క్యాల్షియం, మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు కాబట్టి దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంటాయి.

Tags :
|
|
|

Advertisement