Advertisement

ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే నిమ్మకాయను ఇలా వాడండి

By: Sankar Sun, 23 Aug 2020 6:43 PM

ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే నిమ్మకాయను ఇలా వాడండి


నిమ్మకు మించిన సహజ ఔషధం లేదు. ఆరోగ్యానికైనా, అందానికైనా నిమ్మ‌కాయ ప్ర‌త్యేకం. సిట్రిక్ యాసిడ్, విట‌మిన్ సి, పాస్ప‌ర‌స్‌, విట‌మిన్ బి, కార్బోహైడ్రేట్ల‌ను నిమ్మ క‌లిగి ఉంటుంది. నిమ్మ‌ర‌సం చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాక‌పోతే ఈ ర‌సం యాసిడ్‌తో స‌మానం. అందుక‌ని డైరెక్టుగా ముఖానికి అప్లై చేస్తే ఏవ‌మ‌తుందో అని మ‌హిళ‌లు భ‌య‌డ‌పడుతూ ఉంటారు. ఇలాంటి భ‌యాలేం వ‌ద్దు. నిమ్మ‌ర‌సాన్ని ముఖానికి రాసుకుంటే అందంగా త‌యార‌వుతుంది. అయితే ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.

1. నిమ్మ‌ర‌సాన్ని కొంచెం నీటిలో వేసి క‌లుపాలి. దీన్ని కాట‌న్ స‌హాయంతో ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేస్తే స‌రిపోతుంది. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మీద ఉండే మొటిమ‌లు తొలిగిపోతాయి.

2. బ్లాక్ హెడ్స్‌తో బాధ‌ప‌డేవారికి నిమ్మ‌ర‌సం ఉప‌శ‌మ‌నాన్నిస్త‌తుంది. రాత్రి ప‌డుకునే ముందు నిమ్మ‌రాసాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్ర‌దేశంలో రాసుకోవాలి. ఉద‌యం లేచిన త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసుకుంటే స‌రిపోతుంది. కొన్ని రోజులపాటు ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్‌హెడ్స్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

3. నిమ్మ‌కాయ‌ను క‌ట్ చేసి ర‌సాన్ని పిండాలి. అందులో కొన్ని చుక్క‌ల బాదం నూనె, తేనె వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో శుభ్ర‌ప‌రుచుకుంటే చ‌ర్మంపై ఉన్న ముడ‌త‌ల‌న్నీ పోయి య‌వ్వ‌నంగా త‌యార‌వుతారు.

4. నిమ్మరసం, తేనె, ఆలివ్ ఆయిల్‌ను స‌మానంగా తీసుకొని ఫేస్‌మాస్క్ వేసుకోవాలి. ఈ మాస్క్‌ను చ‌ర్మానికి అప్లై చేసుకొని 10 నిమిషాల త‌ర్వాత కడిగేసుకోవాలిల‌. ప్ర‌తిరోజూ ఇలా చేస్తే చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది.

5.ఒక చెంచా లెమన్ పీల్ పౌడర్ ను ఒక పచ్చిపాలను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ఫేషియల్ గా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.






Tags :
|
|

Advertisement