Advertisement

ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ అందాన్ని పెంచుకోండి

By: Sankar Wed, 19 Aug 2020 7:57 PM

ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ అందాన్ని పెంచుకోండి


అందం విషయంలో అమ్మాయిలు తీసుకున్నంత జాగ్రత్తలు అబ్బాయిలు తీసుకోరు..ఏదో ఓ క్రీమ్ రాసుకుని సరిపెట్టేసుకుంటారు. పెద్దగా సమయం కేటాయించకుండా ఈ ఈజీ టిప్స్‌తో అబ్బాయిలు కూడా అందాన్ని కాపాడుకోచవచ్చు. అవేంటో చూసేయండి మరి.

1.ముఖం జిడ్డుగా కనిపిస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తమతోపాటు ఒక చిన్న పౌడర్ డబ్బా వెంట పెట్టుకోవడం మంచిది. అందరి ముందు పౌడర్ రాసుకోవడం బాగోదు కాబట్టి.. ఫేస్ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లండి. ఇది మీ ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చేతిలో జస్ట్ రెండు చుక్కలు శానిటైజర్ వేసుకుని దూదితో ముఖాన్ని తుడుచుకుంటే చాలు.. ముఖం క్లీన్‌ అవుతుంది. దూది అందుబాటులో లేకపోతే రుమాలునైనా ఉపయోగించవచ్చు.

2. వేసవిలో ముఖం కమిలిపోవడం సర్వ సాధారణమే. ఈ సమస్య తీరాలంటే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. ఒక వేళ లోషన్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి కమిలిన చోట రాయండి. వెంటనే చర్మం సాధారణ రంగులోకి మారిపోతుంది.

3. మొటిమలు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో క్రీములు కొంటారు. అవి పనిచేయకపోతే బాధపడతారు. అయితే, ఈ సమస్యను మీ ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.

4. ఇందుకు కలబంద మొక్క ఉంటే చాలు. కలబంద మధ్యలో ఉండే జిగురు తీసుకుని ముఖంపై మర్దనా చేయాలి. తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

5. కొందరికి కళ్లు వాచి ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఆ సమస్య తీరాలంటే.. ఒక స్పూన్‌ను ఫ్రీజర్లో పెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత స్పూన్ బయటకు తీసి కంటిపై 20 సెకన్లు ఉంచండి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేస్తే కళ్ల వాపు తగ్గి.. మీ ముఖం మళ్లీ అందంగా మారుతుంది.

Tags :
|
|
|

Advertisement