Advertisement

చర్మ సౌందర్యం కోసం కొబ్బరి పాలు ..

By: Sankar Wed, 05 Aug 2020 7:03 PM

చర్మ సౌందర్యం కోసం కొబ్బరి పాలు ..



చర్మ సౌందర్యం కోసం తాపత్రయపడని వారుండరు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే రసాయనిక క్రీమ్స్‌ వాడుతుంటారు. ఫలితంగా.. ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

1. గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్‌వాటర్‌, కొబ్బరి పాలు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల నిర్జీవమైన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

2. కొబ్బరిపాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకొని సాఫ్ట్‌గా మర్దనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి తేమ అందుతుంది.

3. గులాబి రేకులు, ఒక స్పూన్‌ తేనె, అరకప్పు కొబ్బరి పాలను ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. దీనివల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతివంతంగా తయారవుతుంది.

4. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి 10 నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న మురికి తొలిగి తాజాగా మారుతుంది.

5. ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్‌ చొప్పున బాదం పొడి, తులసి పొడి, రెండు చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.

Tags :
|
|
|
|

Advertisement