Advertisement

గృహ నిర్మాణం చేసేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి..

By: Sankar Sun, 30 Aug 2020 11:38 AM

గృహ నిర్మాణం చేసేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి..


శాస్త్రపరంగా ప్లాన్ చేసి గృహనిర్మాణం చేపట్టిన గృహసుడు తనకంటూ కొన్ని విషయాలు గృహనిర్మాణం గురించి తెలుసుకొని యుండవలెను. ఎందుకంటే గృహం నిర్మించే ఇంజినీర్ గానీ, వాస్తు సలహాదారుగానీ ఇంటికి ప్రతిరోజు రావడానికి వీలు కుదరదు.

1. గృహం నిర్మించే ముందు ఆ స్థలం యొక్క అష్టదిశల్ని స్పష్టంగా సరిచూసుకోవలెను. మూలలయొక్క కొలతల్లో లోపాలుంటే ఇంటివారికి కలతలు తప్పవు. కావున మూలలు నిరుష్టంగా నిర్ధారణ చేసుకోవలెను

2. ముందు ప్లాటు చుటూ ప్రహరి నిర్మించవలెను.

3. ప్రహరి నిర్మాణమునకు, గృహ నిర్మాణమునకు పునాది తవ్వకం ఈశాన్యము నుండి మొదలు పెట్టి చివరగా నైరుతి మూల త్రవ్వవలె, కట్టడం మాత్రము నైరుతి మూల మొదలు పెట్టవలెను

4. గృహనిర్మాణానికుపయోగించు రాయి, ఇటుక, సిమెంటు, ఇసుక మొదలగు వాటిని ప్లాటుకు పశ్చిమము లేదా దక్షిణ భాగములో గాని, మీ ప్రక్క ప్లాటుల్లో గాని వేసుకోవలెను. ప్లాటు ఏ దిశ కూడా తెగి యుండకూడదు.

5. ఇంటి ముందు ఒక్క రోడు కాకుండా, ఇంటికి నలువైపులలో రెండుగాని, మూడుగాని మరియు నాలుగు రోడ్లు ఉన్నచో మంచిది.

6. స్థలాలు ఇతర దిశలందు మెరకగా యుండి, ఉత్తర, తూర్పు, ఈశాన్యాలు పల్లముగా యున్న గృహము నిర్మించవచ్చును. గోతులు, నైరుతి, పడమర వేపు యున్న స్థలాలు గృహ నిర్మాణమునకు పనికిరావు.

7. మనం ఎన్నుకొన్న ప్లాటు సమతలంగా యున్నా మంచిదే. ముక్కోణపు ప్లాటును ఎప్పడు గృహ నిర్మాణమునకు ఎన్నుకొనకూడదు. మనము గృహమునకు ఏ సింహద్వారమైనా శాస్త్ర సమ్మతముగా నిర్మించిన మంచి ఫలితములు ఇచ్చును


Tags :
|
|

Advertisement