Advertisement

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు...

By: chandrasekar Wed, 23 Sept 2020 12:35 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు...


శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా మంగ‌ళ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది.

సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు తీసుకు వచ్చిన గొడుగులకు టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులుశేఖ‌ర్‌రెడ్డి, గోవింద‌హ‌రి,హెచ్‌డిపిపి సభ్యులు సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు.

టిటిడి అధికారుల‌కు ఈ గొడుగుల‌ను అందించారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను తీసుకురాగా, ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించారు.

Tags :

Advertisement