Advertisement

భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు...

By: chandrasekar Wed, 16 Dec 2020 9:25 PM

భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు...


మంగళవారం భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మత్య్సావతారంలో స్వామి దర్శనం ఇచ్చారు. మత్స్యావతారంలో స్వామివారు ఆలయం నుంచి బయల్దేరి చిత్రకూట మండపానికి వచ్చారు. పర్ణశాల రామాలయంలోనూ స్వామివారి ఉత్సవ మూర్తులను మత్స్యావతారంలో అలంకరించారు. ఆళ్వార్లను మండపానికి తీసుకొచ్చి పాశురాలను పఠించాక ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, సుదర్శనుడు, విష్వక్సేనుల వారిని ఒకే మండపానికి తీసుకొచ్చారు. స్వామి వారు కరోనా కారణంగా ఈసారి మిథిలా ప్రాంగణానికి వెళ్లలేదు.

స్వామివారు బుధవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 26 నుంచి నిత్య కళ్యాణాలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ నెల 24న తెప్పోత్సవం, 25న ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి వేడుకల సందర్భంగా నిత్య కళ్యాణాలను నిలిపేశారు. తెప్పోత్సవం కోసం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Advertisement