Advertisement

శ్రీకృష్ణావతారం

By: chandrasekar Wed, 22 July 2020 7:26 PM

శ్రీకృష్ణావతారం


దేవకీ, వసుదేవ్ఞల అష్టమను సంతానంగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దేవకి సోదరుడు అయినటువంటి కంశుడు దేవకికి పుట్టిన వారందరినీ పుట్టగానే చంపేస్తుంటాడు. దానికిగల ముఖ్యకారణం దుష్టుడైన కంశుడు తన తండ్రి, మధురపాలకుడైన ఉగ్రసేన మహారాజుని పదవీచ్యుతుణ్ణి చేసి, చెరసాలపాలు జేశాడు.

ఒకరోజు కంసుడు తన సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవ్ఞని గృహానికి రధంలో తీసుకెళ్తుండగా హఠాత్తుగా ఒక మెరుపు మెరిసి, ఆకాశవాణి నుండి దేవకికి పుట్టబోయే అష్టమపుత్రుని వల్ల కంశునికి ప్రాణహాని ఉందని హెచ్చరించింది. అది విన్నటువంటి కంశడు అక్కడే దేవకిని సంహరించబోగా, వసుదేవుడు అడ్డుపడి తమకు పుట్టబోయే ప్రతిబిడ్డనూ కంశుడికి ఇస్తానని హావిూ ఇవ్వడంతో కంశుడు దేవకిని చంపకుండా ఆగిపోతాడు.

అలా సాగుతుండగా దేవకి వరుసగా ఆరుగురు పుత్రులను జన్మనివ్వడంతో ఆరుగురిని కంశుడికి ఇస్తాడు. వారందరినీ కంశుడు వధిస్తాడు. శ్రీమహావిష్ణువు తన మాయద్వారా వారికి పుట్టబోయే ఏడవసంతానాన్ని వసుదేవుని ఇంకో భార్య అయినటువంటి రోహిణి గర్భంలోకి ప్రవేశింపజేస్తాడు. ఇలా ఉండగా కొన్ని రోజులకు దేవకి అష్టమసంతానానికి జన్మనిస్తుంది. ఆయనే శ్రీకృష్ణుడు.

అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టి తలపై పెట్టుకుని మోసుకుంటూ యమునానదిని దాటి, గోకులగృహంలో ఉన్న నందునికి ఇచ్చి, నందునికి అప్పుడే జన్మించిన ఆడశిశువుని తీసుకొని చెరసాలకు తిరుగు ప్రయాణమయ్యాడు. దేవకికి అష్టమసంతానం కల్గినవార్తను విన్న కంసుడు ఆ బిడ్డను కూడా సంహరించాలని ఆ పసిపాపను ఖడ్గంతో ఖండించేందుకు కత్తి పైకి ఎగురవేస్తాడు.

srikrsnavataram,lord krishna,devaki,vasudevna ashtama,brother ,శ్రీకృష్ణావతారం, దేవకీ, వసుదేవ్ఞల , అష్టమను , సంతానంగా


అప్పుడు ఆ పసిపాప నవ్వి నిన్ను సంహరించే వాడు క్షేమంగా గోకులంలో ఉన్నాడని చెప్పి అదృశ్యమవ్ఞతుంది. ఆ అష్టమశిశుడే శ్రీమహావిష్ణువు అవతారమయినటువంటి శ్రీకృష్ణుడు. తాను మేనమామ కంసుడిని హతమార్చి, ఉగ్రసేనుడ్ని సింహాసనాధిష్టుడిని చేసి, తన తల్లిదండ్రులను బంధవిముక్తులను చేసేందుకే కష్ణావతారం ఎత్తాడు.

శ్రీకృష్ణుడు ప్రేమాస్వరూపుడు. శ్రీకృష్ణుడంటే గోపికలందరికీ ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు చిన్నికృష్ణుడు తన చలిపిచేష్టలతో గోపికలను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ శ్రీకృష్ణుడు రాకకోసం గోపికలు క్షణక్షణం ఎదురుచూస్తుండేవారు. ఆయన ఆగడాలపై యశోదమ్మకు ఫిర్యాదు చేసినప్పటికీ, తల్లి శ్రీకృష్ణుడిని మందలించబోతే వారే మళ్లీ అడ్డుకునేవారు.

అయితే గోపికలంతా అపర సౌభాగ్యశాలినులు. మహాసాధన ఫలస్వరూపంగా భగవంతునికి సేవ చేసేందుకుగాను గోపికల రూపంలో అవతరించారు. ప్రేమరసమయుడైన శ్రీకృష్ణుడు గోపికల ఆనందం కోసం వెన్నను దొంగిలించినా, స్నానాలు ఆచరిస్తుండగా వస్త్రాలు అపహరించుకుపోయినా ఆయన లీలలు దివ్వరాసలీలుగానే చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి గోపికలలో కొంతమంది గత జన్మల్లోని దేవకన్యలున్నారు. మరికొందరు గొప్ప తపస్సు చేసినటువంటి బుషులు కూడా ఉన్నారు. వీరంతా కూడా భగవంతుని సేవకోసం జన్మించినవారే.

Tags :
|

Advertisement