- హోమ్›
- జాతకం ఓర జోతిష్యం›
- రాజస్థానీ సంప్రదాయంలో శ్రీ కృష్ణాష్టమి
రాజస్థానీ సంప్రదాయంలో శ్రీ కృష్ణాష్టమి
By: chandrasekar Sat, 08 Aug 2020 8:09 PM
రాజస్థాన్‌లో
కృష్ణాష్టమికి మట్టివిగ్రహాలను తయారుచేసి ప్రత్యేక పూజలు చేస్తామని
జిల్లాకేంద్రంలోని రాణీ సతీజీ కాలనీలో నివాసముంటున్న రాజస్థాన్‌వాసులు తెలిపారు. కృష్ణుడి విగ్రహానికి పండగరోజు ఉదయం
తెల్లదుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. కట్టెతో చేసిన పీటపై కొన్ని
కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు.
ఉపవాసదీక్షలు పాటించి
కృష్ణుడిగీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటిపడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో
చప్పట్లు కొడుతూ కృష్ణుడిని వేడుకుంటారు. ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే
చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తాం. ఆవుదూడను వెంటతీసుకొని చంద్రుడు కన్పించే
విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో
తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ
సంప్రదాయ వేషధారణలో డీజే పాటలపై ఆనందోత్సవాలతో కృష్ణుడి గీతాలపై నృత్యాలు
చేస్తారు.
మరునాడు ఉదయం ఒక మహిళ
పవిత్రస్నానమాచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి
నెత్తిన మహాళలు, యువతీ, యువకుల సమక్షంలో దాదాపు 15-20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ
వూరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు
వెళ్తారు. ఎంతదూరమున్నా పాదయాత్రగా వెళ్లి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి
పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట
కూర్చుని కృష్ణభగవానుని స్మరించుకొని తమ తమ ఇళ్లలోకి వెళ్లి ఉపవాస దీక్షల్ని
విరమిస్తారు.