Advertisement

వీడిన సూర్య గ్రహణం ..తెరుచుకున్న ఆలయాలు

By: Sankar Sun, 21 June 2020 5:58 PM

వీడిన సూర్య గ్రహణం ..తెరుచుకున్న ఆలయాలు



ఆకాశంలో జరిగే అద్భుతాలలో సూర్యగ్రహణం ఒకటి ..సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు అడ్డు రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ..సూర్యుడికి చంద్రుడు అడ్డు రావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం ఆదివారం కనువిందు చేసింది. తొలుత భారత్‌లో గుజరాత్‌లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది.

ఇక తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించలేదు..తెలంగాణలో ఈ సూర్య గ్రహణం ఆదివారం ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు ఉన్నదీ ..దాదాపు 51 శాతం గ్రహణం కనిపించింది .. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 10.21 గంటల నుంచి మద్యాహ్నం 1.39 వరకు ఉన్నదీ 46 శాతం వరకు గ్రహణం కనిపించింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు మూడున్నర గంటల పాటు సూర్య గ్రహణం ఉన్నదీ..

సూర్య గ్రహణం వీడటంతో దేశంలో ఉన్న అనేక ఆలయాలు మళ్ళీ తెరుచుకున్నాయి ..సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. అలాగే పుణ్యాహవచనం నిర్వహించారు. ఏకాంతంగానే శ్రీవారికి పూజా కైంకర్యాలు చేశారు. నేడు పూర్తిగా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభించనుంది.

Tags :
|
|
|
|

Advertisement