Advertisement

మూడవ రోజు ‘గాయత్రిదేవి’ రూపంలో బెజవాడ దుర్గమ్మ…

By: chandrasekar Mon, 19 Oct 2020 2:56 PM

మూడవ రోజు ‘గాయత్రిదేవి’ రూపంలో బెజవాడ దుర్గమ్మ…


విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ‌రోజు దుర్గమ్మతల్లి శ్రీగాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ‌ముఖాలతో గాయత్రి దేవి దివ్య మంగళ రూపంను దర్శించుకొనేందుకు భక్తులు కొండపైకి తరలివస్తున్నారు.

తెల్లవారు జామున ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కొనసాగుతుంది. కోవిడ్ దృష్ట్యా పది వేల స్లాట్ తో పాటు క్యూలైన్లలో 100, 300 టిక్కెట్లకు కరెంటు బుకింగ్ కల్పిస్తున్నారు దుర్గగుడి అధికారులు.

Tags :

Advertisement