Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఎవరితో పంచుకోరాదు

By: Sankar Sat, 13 June 2020 8:13 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఎవరితో పంచుకోరాదు



వాస్తుశాస్త్రం ప్రకారం శక్తి అనేది ఎంతో విస్తారమైంది. కాబట్టి మనం ఎవరికైన ఏదైనా వస్తువులు ఇచ్చేటప్పుడు లేదా వారి నుంచి పుచ్చుకునేటప్పుడు ఈ ఎనర్జీ ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. అందులో ప్రతి కూల శక్తి ఉన్నట్లయితే జీవితంలో మనం పురోగతి సాధించలేం. కాబట్టి కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. అంతేకాకుండా జీవితంలో ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. మరి ఏయే వస్తువులు తీసుకోకూడదు, ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం.

మనం సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎక్కువ మంది మర్చిపోయేది పెన్నునే. సహజంగా ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. కాబట్టి కలాన్ని తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ అక్కడ ఎవరైన పెన్ను అడిగితే.. వారికి ఇచ్చి పని పూర్తయిన వెంటనే తిరిగి తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం కలాన్ని ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్ముతుంటారు. అంతేకాకుండా వ్యాపారవాణిజ్యాల్లో పెట్టిన పెట్టుబడుల్లో ధననష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.

pen,watch,clothes,astrology,exchange ,వాస్తు శాస్త్రం,  పెన్ను , ఆర్థిక సమస్యలు,  ధననష్టం , వస్తువులు


ఇతరుల బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల వస్త్రాలు ధరించినట్లయితే వారి ప్రతికూల శక్తి (నెగిటివ్ ఎనర్జీ) మనకు వస్తుంది. కాబట్టి తోటివారి బట్టలు ధరించడం మానుకోవాలి. ముఖ్యంగా శుభకార్యాలప్పుడు ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి శుభకార్యాలప్పుడు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే దురదృష్టం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడితో పాటు పనిలోనూ శ్రద్ధపెట్టక మీ పనిని మీరే నాశనం చేసుకునే ప్రమాదాముంది.

వాస్తుశాస్త్రం ప్రకారం గడియారం వల్ల వ్యక్తి జీవితంలో కొన్ని మంచి ప్రభావాలు, మరికొన్ని చెడు ప్రబావాలుంటాయి. కాబట్టి మీ గడియారాన్ని ఇతరులకిచ్చి మార్చిపోకూడదు. అంతేకాకుండా ఇతరుల గడియారాన్ని మీరు పెట్టుకోకూడదు. ఇలా చేయడం ద్వారా ఎదుటి వ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా జీవితంలో విజయానికి బదులు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతోపాటు మీరు ఎంచుకున్న రంగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :
|
|

Advertisement