Advertisement

కూష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి...

By: chandrasekar Wed, 21 Oct 2020 1:22 PM

కూష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి...


శ్రీశైలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగలా జరుగుతున్నాయి. నాలుగోరోజు ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది.

సాత్వికరూపంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల అమృత కలశంతో దర్శనమిచ్చింది.

ఈ దేవిని పూజిస్తే సర్వరోగాలు తొలగి ఆరోగ్యం, ఆయువు, యశస్సు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేసారు.

కైలాస వాహనాన్ని అధిరోహించిన శ్రీశైల మలన్న భక్తజనులకు దర్శనమిచ్చారు. వర్షం కారణంగా ఆలయ ఉత్సవం నిర్వహించలేదని ఈఓ కేఎస్‌ రామారావు చెప్పారు.

Tags :

Advertisement