హిల్ స్టేషన్స్ కొడైకెనాల్, కలింపోంగ్ సౌదర్యాలు చూద్దాం


వేసవిలో చాలా మంది వివిధ ప్రాంతాలకు పర్యాటకానికి వెలుతుంటారు. అటువంటి ప్రాంతాల్లో హిల్ స్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఈ మే నెలలో అక్కడి వెళ్లి ప్రకృతిలో మమేకం కావాలనుకొనేవారికి బాగా నచ్చుతుంది.

కొడైకెనాల్ లో మీకు జలజలా రాలే జలపాతాలు, నిర్మలమైన సరస్సులు, పచ్చటి కొండకోనలన్నీ ఒకే చోట చూడాలని వాటి మధ్య సమయం గడపాలనుకొనేవారికి తమిళానడు రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా కొడైకెనాల్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాల నుంచి ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇక్కడి కొడై లేక్, పిల్లర్ రాక్ తదితర టూరిస్ట్ స్పాట్ లలో సైక్లింగ్ కు కూడా అవకాశం ఉంది.


డార్జిలింగ్ కు కొంచెం దూరంలో ఉన్న మరో హిల్ స్టేషన్ కలింపోంగ్. మిగిలిన హిల్ స్టేషన్స్ వలే అంతగా ప్రాచూర్యం పొందక పోయినా ప్రకృతిని ఆస్వాధించే వారికి ఈ కలింపోంగ్ తప్పక నచ్చుతుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మంచి రవాణా, వసతి సౌకర్యాలు అందుబాటులోకి ఉన్నాయి.