ఊటీ అందాలు


ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది ఊటీగా సంక్షిప్తీకరించబడింది. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లా లో వున్నది. ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అనికూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి. కొండలపై సమృద్ధిగా పెరుగుతున్న యూకలిప్టస్ చెట్లనుండి ప్రసరించే నీలం పొగవల్ల పర్వతాలు నీలంగా ఉంటాయి అని స్థానికుల అభిప్రాయం.

ఈ పట్టణంలో సంస్కృతిలో, నిర్మాణాలలో బ్రిటీష్ వారి ప్రభావం చూడవచ్చు. నిజానికి, ఈ పర్వత ప్రాంతం ఆసక్తి కలిగించేవిగా మిగిలిపోయిన ఇంగ్లీష్ గ్రామం అని పర్యాటకులు గుర్తించారు. బహుశ దీనికి కారణం ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటక వ్యాపారం పై రూపొందించబడటమే. బ్రిటీషు వారు ఇక్కడి వాతావరణం, అద్భుతమైన అందానికి ముంగ్ధులై ఈ ప్రాంతానికి “హిల్ స్టేషన్స్ రాణి” అని పేరుపెట్టారు. వారు ఒక నిధి లాంటి ఈ ప్రాంతాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే , దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల వేడిని, తేమతో కూడిన వాతావరణాన్ని వారు తట్టుకోలేరు. వారు విల్లింగ్టన్ సమీప పట్టణంలో మద్రాసు రెజిమెంట్ కు సంబంధించి ఆ ప్రాంతంలో స్థిర పడాలని భావించారు. నేడు, విల్లింగ్టన్ ప్రదేశం మద్రాసు రెజిమెంట్ కి కేంద్రంగా ఉంది. నిజానికి, అనేకమంది గాయపడిన, అనారోగ్య సైనికులు ఊటీకి పంపబడ్డారు. విల్లింగ్టన్ మరో మారు పునరుద్ధరించబడింది. వేసవి వేడి నుండి తప్పించుకొనడా నికి చాలామంది వారాంతాల లోకూడా వస్తూ వుండటం తో ఊటీ కి ప్రజాదరణ పెరిగింది.

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఊటీ అభివృద్ధిని చేపట్టారు, నీలగిరుల పై తేయాకు , టేకు, చిన్కోన పంటలు పెంచడం ప్రారంభించారు. ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది అనడానికి ఇది మరో ముఖ్యమైన అంశం. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, సారవంతమైన నేల వ్యవసాయంలో విజయం సాధించడానికి దోహదపడ్డాయి. మీరు ఊటీకి దగ్గరగా ప్రారంభంలో వివిధ టీ, కాఫీ తోటలను చూడవచ్చు. ఇవి స్థానిక ప్రజలకు ప్రధానం అనిచెప్పవచ్చు, వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ పనిని చేస్తున్నారు. చాలా అద్భుతమైన టీ మరియు కాఫీ తోటల ఆస్తులు ఇప్పుడు ఊటీలో, చుట్టూ ఉన్నాయి.


మీరు ఊటీలో చుట్టూ నడుస్తున్నపుడు, మీరు ఊటీలోని భవణాల నిర్మాణం, నమూనాలను చూచినపుడు పురాతన కాలానికి వెళ్ళిపోతారు. అది మీకు గడచిన కాలాన్ని గుర్తుచేస్తుంది. ఊటీ కి ఏవిధమైన చరిత్ర లేదు. బ్రిటిష్ వారి రాకతో దీని పెరుగుదల ప్రారంభమయింది. ఆధునిక ప్రపంచంలో, ఊటీ చరిత్ర పరదేశ భూమిలో బ్రిటీష్, ముఖ్యంగా సైనికుల స్థావరాలతో మొదలైనది. ఈ పట్టణంలో ప్రవేశించిన వారికి ఆ ప్రదేశం లో బ్రిటీష్ వారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కళలు, భవన నిర్మాణం, నమూనాలు, ఇళ్ళ నిర్మాణంలో శైలి అన్నీ బ్రిటీష్ కాలాన్ని గుర్తుకుతెస్తాయి. బ్రిటీషు వారి సాంస్కృతిక పద్ధతులు స్థానిక ప్రజల జీవితాల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా తీవ్రంగా పాతుకు పోయాయి. స్థానిక వంటకాలు కూడా ఇంగ్లీష్ వంటకాల నుండి భారీగా అరువు తీసుకుంది. దీని ఫలితంగా, మీరు ఇంగ్లీషు మూలికలు, భారతదేశ సుగంధ ద్రవ్యాల విలీనీకరణంతో ఊటీలో ఉత్తమ ఆహరం పొందుతున్నారు.

బొటనికల్ గార్డెన్ లు , దోడబెట్ట శిఖరం, ఊటీ సరస్సు, కల్హట్టి జలపాతం, ఫ్లవర్ షో మొదలైన కొన్ని ప్రదేశాల వల్ల ఊటీ ప్రపంచం మొత్తం మీద పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతాన్ని రోడ్డు, రైలు ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఊటీకి సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ వద్ద ఉంది. ఊటీలో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లదకరంగా ఉంటుంది . అయితే, శీతాకాలం దక్షిణ భారతదేశ సాధారణం కంటే కొంచే౦ తక్కువ చల్లగా ఉంటుంది.

ఊటీ సరస్సు: ఊటీ మధ్యలో ఉన్న ఈ సరస్సును మీరు సినిమాల్లో చూసే ఉంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని మైమరపిస్తాయి. ఈ సరస్సులో బోటింగ్ మీకు సరికొత్త అనుభూతి ఇస్తుంది.


అప్పర్ భవానీ సరస్సు: నీలగిరి కనుమల అందాలను చూడాలంటే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. ఊటీ నుంచి 40 కిమీల దూరంలో ఈ సరస్సు ఉంది. అప్పర్ భవానీ రిజర్వాయర్‌లో ఉన్న ఈ సరస్సు నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు కట్టిపడేస్తాయి.

పైకారా సరస్సు: ఇక్కడ దేశంలోనే అత్యంత పురాతన పవర్ ప్లాంట్‌ ఉంది. ఊటీకి 12 కిమీల దూరంలో ఉన్న ఈ సరస్సు షోలా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. ఇక్కడ బోటింగ్, స్పీడ్ బోటింగ్ తదితర వినోదాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కామరాజ్ సాగర్ సరస్సు: ఊటీలో ఫేమస్ పిక్నిస్ స్పాట్ ఇది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. కామరాజ్ సాగర్ డ్యామ్ సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా పేరొందింది. ఇక్కడి సూర్యాస్తమయం భలే అందంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సంధ్యనల్లా రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు. ఇది ఊటీకి 10 కిమీల దూరంలో ఉంది.

అవలాంచె సరస్సు: ఊటీలోని పర్యాటకుల అమితంగా ఇష్టపడే ఈ సరస్సు భలే ఒంపులు తిరిగి ఉంటుంది. పచ్చిక బయళ్లులాంటి కొండల చూట్టూ విస్తరించిన ఈ సరస్సు ప్రకృతి ప్రేమికుల మది దోచేస్తుంది. చాలామంది ఇక్కడ నేచర్ వాక్ (ప్రకృతి నడక) చేస్తారు. క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తారు.

ఎమెరల్డ్, బెల్లిక్కల్ సరస్సులు: టీతోటలను ఆనుకుని ఉన్న ఎమెరల్డ్ సరస్సు ప్రకృతి అందాలతో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న బెల్లిక్కల్ సరస్సు సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్, మౌంటైన్ బైకింగ్‌కు ఇది ఫేమస్.

వేసవిలో ఎక్కువ మంది ప్రజలు వేడి నుండి బయట పడటానికి ఊటీకి ట్రావెల్ చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. ఇది మనస్సుకి ఆనందానివడంతో బాటు ఆహ్లాదకరమైన కొండ ప్రదేశంలోని మంచు పొగలు వుతేజాన్ని కలిగిస్తుంది.