పచ్చని చెట్లతో కొత్త అందాలను సంతరించుకున్న హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌


హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ గతంలో కళావిహీనంగా ఉన్న గార్డెన్ తెలంగాణ ప్రభుత్వ హయాంలో కొత్త అందాన్ని సంతరించుకుంది. పచ్చని చెట్లతో కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.


తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధీనంలోనున్న 274 ఎకరాల కొత్తగూడ రిజర్వు అటవీ ప్రాం తాన్ని సహజవనంగా రూపుదిద్దారు. రూ. 5 కోట్లతో గార్డెన్‌ను దశలవారీగా మొత్తం 12 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైటెక్‌సిటీ ప్రాంతంలో పచ్చదనంతో నిండిన బొటానికల్ గార్డెన్ ఇప్పుడు అందరికీ చేద తీరుస్తున్నది.


పార్కు సహజత్వం దెబ్బతినకుండా ప్రత్యేకంగా ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు చేపట్టారు. పార్కులో పాఠశాల చిన్నారులు, ఇతరులకు అటవీ సంపద, పర్యావరణం మీద అవగాహనతో పాటు, వన్యప్రాణులు వాటి జీవన విధానం వంటివి వివరించడానికి ఎల్సీడీ సౌకర్యంతో.. ఒకేసారి 100 మంది కూర్చోని చూసే లా వీడియో హాల్‌ను నిర్మించారు. దీంతో పాటు ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేశారు.