ఈస్ట్ ఇండియా కంపెనీ 1640లో నిర్మించిన ఫోర్ట్ సెయింట్ జార్జ్


భారత దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1640లో నిర్మించిన మొట్టమొదట కోట 'ఫోర్ట్ సెయింట్ జార్జ్'. ఇది అనేక వారసత్వ భవనాలతో నిండి ఉంటుంది. ఇది ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యాలయంగా ఉండగా, జార్జ్ టౌన్ అని పిలువబడే పరిసర ప్రాంతంలో బర్మా బజార్ వంటి అనేక హోల్ సేల్ మార్కెట్ లు ఉన్నాయి.

అలాగే ఈ పరిసరాల్లో 17వ శతాబ్ధం నాటి సుందరమైన సెయింట్ మేరీస్ చర్చి మరో ఆకర్షణగా నిలుస్తుంది. ఇది భారతదేశంలోని ప్రాచీన ఆంగ్లికన్ చర్చి. తరువాత ఫోర్ట్ మ్యూజియంను సందర్శించండి. 18వ శతాబ్ధం నాటి ఈ భవనం ఇప్పుడు ఎక్స్ఛేంజ్ హౌస్ గా పిలువబడుతుంది. ఇది బ్రిటిష్ కాలం నాటి వివిధ జ్ఞాపకాలను, వలస వాద మద్రాసు యొక్క ప్రింట్ లు, పెయింటింగ్స్ ను ప్రదర్శిస్తుంది. కోట పక్కనే ఉన్న హైకోర్టు ప్రపంచంలో రెండవ అతిపెద్ద న్యాయ భవనం. 1892లో ఇండో-సారాసెనిక్ శైలిలో నిర్మించబడిన ఈ భవనం భారతదేశపు మొదటి సుప్రీం కోర్టుగా అవతరించింది.