చెన్నైలోని కపలీశ్వర్ ఆలయ౦ విశేషాలు


తమిళనాడులో చెన్నైకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నగరంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆహ్లాదకరమైన బీచ్ లు, ఆసక్తి కలిగించే మ్యూజియంలు, అద్భుతమైన ఆలయాలు, వన్యప్రాణి అభయారణ్యాలు వంటి ఎన్నో ప్రదేశాలు చెన్నైలో తప్పక చూడాల్సిన వాటి జాబితాలో ఉన్నాయి. వీటిలో రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

కపలీశ్వర్ ఆలయ౦

ఒకప్పుడు పల్లవుల నౌకాశ్రయంగా ఉన్న మైలపూర్ పరిసరాలు శివుడికి అంకితం చేయబడిన కపలీశ్వర్ ఆలయానికి ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ శివుని పేరు కాపాలీశ్వరుడు. మైలాపూర్ ప్రాంతాన్ని తిరుమయిలై, కపాలీశ్వరము అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 7వ శతాబ్ధంలో నిర్మించిన ఇక్కడి ఆలయ సముదాయం ద్రావిడ ఆలయ నిర్మాణానికి సంబంధించిన శ్రేష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇందులో నాయన్మార్లు లేదా శివుని సాధువుల యొక్క కాంస్య విగ్రహాలు చాలా కనిపిస్తాయి. రంగురంగుల ప్రవేశ గోపురం అనేక దేవతా విగ్రహాలతో రూపొందించబడింది. ఈ ఆలయంలో మూర్తులుగా వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల వీధులు దుకాణాలతో, పూల అమ్మకందారులతో సందడిగా కనిపిస్తుంటాయి. చెన్నై వెళ్లేవారు తప్పక చూడవలసిన ఆలయ౦.