రుచికరమైన క్యాలీఫ్లవర్ తో బటర్ మసాలా కర్రీ ఎలాచేయలో చూద్దాం


తెలుగువారి వంట గదుల్లోకి ఆలస్యంగా వచ్చినా ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ క్యాలీ ఫ్లవర్.దీనిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో చాలా వెరైటీస్ చేయవచ్చు. మనం క్యాలీఫ్లవర్‌ బటర్‌ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం.

క్యాలీఫ్లవర్‌ బటర్‌ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు:

* క్యాలీఫ్లవర్‌ – 1
* బిర్యానీ ఆకు – 1
* లవంగాలు – 2
* పసుపు – అర టీ స్పూను
* బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు
* ఏలకులు – 2
* దాల్చిన చెక్క – చిన్న ముక్క
* తరుగు – అర కప్పు
* టొమాటో తరుగు – అర కప్పు
* అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు
* మిరప కారం – 2 టీ స్పూన్లు
* ధనియాల పొడి – 3 టీ స్పూన్లు
* గరం మసాలా – అర టీ స్పూను
* జీడిపప్పు పలుకులు – 12
* కసూరీ మేథీ – అర టీ స్పూను
* తాజా క్రీమ్‌ – పావు కప్పు
* నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
* కొత్తిమీర తరుగు – కొద్దిగా
* ఉప్పు – తగినంత

తయాఋ చేయు విధానం:

క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసి. స్టౌ మీద బాణలిలో నీళ్లు, పసుపు వేసి మరిగించాలి. క్యాలీఫ్లవర్‌ తరుగును జత చేసి కొద్దిగా ఉడికించి, క్యాలీఫ్లవర్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. స్టౌ మీద పాన్‌లో బటర్‌ వేసి కరిగాక క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి మూత ఉంచి పది నిమిషాలు ఉడికించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాణలిలో మరి కాస్త బటర్‌ వేసి కరిగాక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం వేసి టొమాటో తరుగు ఉడికేవరకు కలిపి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక నూనె వేసి కాగాక, ఈ మసాలా ముద్దను అందులో వేసి బాగా కలిపి, క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు జత చేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. తాజా క్రీమ్, కసూరీ మేథీ జత చేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీరతో అలంకరించాలి.