వేడి వేడి శనగపప్పు పాయసం


కావాల్సిన పదార్థాలు:

పాలు-ఒక కప్పు
శనగపప్పు - ఒక కప్పు
బెల్లం పౌడర్ - తగినంత
యాలకుల పౌడర్-తగినంత
నెయ్యి-టేబుల్ స్పూన్
బాదంపప్పు, కాజు - కొంచెం

తయారు చేయు విధానం:

స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఒకటికన్నర కప్పు నీరు వేసి, దానిలో శనగపప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఈలోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. దీని కోసం పాత్రలో పావు కప్పు నీరు పోసి గ్యాస్ స్టవ్ పై పెట్టాలి. దీనిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి సన్నని మంటపై నీరు ఇంకేదాకా మరగించాలి. తరువాత ఉడకబెట్టిన శనగపప్పు ఆ పాకంలో వేసి బాగా కలపాలి.కొంచెం సేపు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిలో కొంచెం వేయించిన బాదంపప్పు, కాజు వేసుకోవాలి. అంతే రుచికరమైన శనగపప్పు పాయసం తయ్యార్.