మనం సేమియా,రవ్వ
తో ఉప్మా చేసికుంటూనే ఉంటాము. జొన్నరవ్వ తో కూడా ఉప్మా చేయవచ్చు. ఈ రవ్వ ఉప్మా
ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జొన్న రవ్వతో ఉప్మా చేయడం ఎలాగో తెలుసుకుందాము.
కావలసిన పదార్థాలు :
జొన్న రవ్వ: 100 గ్రా. పచ్చి శనగపప్పు: 7 గ్రా. వేరుశనగ పప్పు: 25 గ్రా. ఆవాలు: 5 గ్రా. జీలకర్ర: 8 గ్రా. కరివేపాకు: 5 గ్రా. ఉల్లిపాయలు: 20 గ్రా. పచ్చిమిర్చి: 5 గ్రా నీళ్లు: 4
కప్పులు ఉప్పు: రుచికి సరిపడా నూనె 20 గ్రా. తయారు చేసే విధానం :
ఒక బాణలిలో 2
టేబుల్ స్పూన్ల నూనె పోసి జొన్న రవ్వను 2 నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో
మిగిలిన నూనె వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 ని. వేగనివ్వాలి. రుచికి తగినంత ఉప్పు వేసి 4
కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ వేసి సన్నని సెగపై 5-10 ని.
ఉడకబెట్టాలి. యిప్పుడు రుచికరమైన ఉప్మా రెడీ.