పాలు - ఒక లీటరు బొంబాయి రవ్వ - అరకప్పు కొబ్బరికాయ-1 చక్కెర - తగినంత యాలకుల పొడి - రెండు
చిటికెలు నెయ్యి - తగినంత
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి తురుము
తీసుకుని పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి.
ఒక పాత్రలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెరను వేసి మరగనివ్వాలి. ఆ మిశ్రమం చిక్కబడే
సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పౌడర్ ను వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల
తర్వాత ఆ పాత్రను గ్యాస్ మీద నుండి తీసి చల్లారిన తర్వాత లడ్డూలుగా తయారు
చేసుకుంటే అంతే రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ.