యోగాకు విశేషమైన శక్తి ఉంది .. జగన్



జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవమ్ ..మాములుగా అయితే ఈ రోజున ప్రజలు అందరూ కలిసి సామూహికంగా యోగాసనాలు వేసేవారు అయితే కరోనా కారణంగా ఈ సారి సామూహిక యోగాసనాలు బ్రేక్ పడింది ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సారి యోగా దినోత్సవంను ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవాలని సూచించారు ..అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యోగ యొక్క గొప్పతనాన్ని ప్రజలతో ట్విట్టర్లో పంచుకున్నాడు ..

యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రజలు ఈ పురాతన అభ్యాసాన్ని తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రతినబూనాలని కోరారు..ఒకే సమయంలో ప్రశాంతత, బలాన్ని ప్రసాదించే విశేషమైన శక్తి యోగాకు ఉందని పేర్కొన్నారు.

ఇదే కాకుండా శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం పైన మీద వ్యాఖ్యలు చేసారు ..ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు..ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది అని ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు