యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునరుద్ధరణ పనులను పరిశీలించిన కెసిఆర్


యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునరుద్ధరణ పనులను కెసిఆర్ పరిశీలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.

పూజానంతరం ఆలయ పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. పనులకు సంబంధించి ఆలయ ఈవో గీత, స్థపతి ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. అనంతరం పనుల పురోగతిపై ఆలయ అధికారులతో సమీక్ష జరపనున్నారు. పనుల తీరుపై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో ప్రత్యే భద్రత చర్యలు చేపట్టారు పోలీసులు.

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.