పవర్ స్టార్ ..పేరే ఒక ప్రభంజనం ..హ్యాపీ బర్త్ డే జన సేనాని


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..సినిమా హిట్ , ప్లాప్ తో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..దాదాపు పదేళ్లు హిట్ లేకుంటే ఆ హీరోను అందరు మర్చిపోతారు కానీ పవర్ స్టార్ ఆలా కాదు..ఎప్పుడో ఖుషి హిట్ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ వరకు ఆ స్థాయిలో హిట్ లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు..ఇక రిలీజ్ కు ముందే అత్తారింటికి దారేది సినిమా పైరసీ అయినా కూడా రిలీజ్ తర్వాత రికార్డు ల దుమ్ము దులిపింది అంటే కేవలం అది పవన్ మేనియా మాత్రమే..పవన్ ప్లాప్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్లకు లాభాలు వచ్చిన సినిమాలు ఉన్నాయి..అందుకే పవన్ అంటే అంత క్రేజ్..


ఇక కేవలం సినిమాల వల్లనే పవన్ అంత క్రేజ్ సంపాదించాడ అంటే చాల వరకు కాదు అనే వస్తుంది సమాధానం..పవన్ కంటే సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన హీరోలు ఉన్నారు..పవన్ సినిమాల కంటే రికార్డు కలెక్షన్స్ తెచ్చిన సినిమాలు ఉన్నాయి..మరి పవన్ కు ఎందుకు అంత క్రేజ్ అంటే అయన వ్యక్తిత్వం అలాంటిది..కష్టం అని ఎవరైనా వస్తే లేదనకుండా సాయం చేసే గుణం పవన్ సొంతం ..తన సినిమా హిట్ అయినా పొంగిపోడు , ఫట్ అయినా కుంగిపోడు..తన పని తాను చేసుకుంటూ వెళ్లడం మాత్రమే పవన్కు తెలిసింది ..ఒకవేళ తన సినిమా ల వల్ల నష్టపోయిన ప్రొడ్యూసర్ లకు , డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడంలో పవన్ ఎప్పుడు ముందు ఉంటాడు..

ఇక ఎప్పుడు సమాజనం గురించి ఎక్కువగా ఆలోచించే పవన్ , ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని స్థాపించాడు..అయితే రాజకీయంగా ఎలా ఉన్న పవన్ మాత్రం తాను నమ్మిన ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాడు..ఉద్దానం బాధితుల యొక్క సమస్యలను ప్రపంచానికి తెలియపరచడంలో పవన్ చేసిన కృషి అందరికి తెల్సిందే...


తాను ఓకే అంటే తనతో సినిమా తీయడానికి ఎందరో ప్రొడ్యూసర్లు లైన్లో ఉన్నప్పటికీ దాదాపు మూడేళ్లపాటు సినిమాల జోలికి వేళ్ళని పవన్ ..అభిమానులు , నిర్మాతల కోరిక మేరకు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు..ప్రస్తుతం వకీల్సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా , క్రిష్ తో మరొక సినిమా చేస్తున్నారు ..హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..రేపు పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు..ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో పవర్ స్టార్ , జన సేనాని పవన్ కళ్యాణ్ జరుపుకోవాలని కోరుకుందాం..