ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓ ... కరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే ..


ప్రపంచ మానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణ ప్రపంచ దేశాలకు సాధ్యం కావటం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తెలియకుండానే వైరస్ మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తుంది

కరోనా వ్యాప్తి చేస్తున్న క్యారియర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ముఖ్యంగా 20 సంవత్సరాల వయసున్న యువత నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మధ్యవయసు వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతోందని, కరోనా వ్యాప్తికి వీరే కారణమని వెల్లడించారు.

కొంతమందిలో కరోనా సోకినట్లుగా లక్షణాలు కూడా కనిపించడం లేదని, ఇక వీరంతా వేరే వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని పేర్కొన్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, వృద్ధులకు ఇది ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.