మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమయినది ... ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌


కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఈ మహమ్మారి నుండి బయటపడేందుకు దేశాలన్నీ కృషి చేస్తున్నాయి.

ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న ఈ వైరస్ చివరిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరించారు. వైరస్ ల విజృంభణ నిజ జీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తుంది అన్నారు. వీటిని ఎదుర్కోవాలంటే వాతావరణంలో వచ్చే మార్పులను పరిష్కారించడం, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేయాలనీ పేర్కొన్నారు...

ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు తాత్కాలిక పరిష్కారం కోసం డబ్బులను కేటాయించడం కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి పాఠాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది అని టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్ అంతర్జాతీయ అంటువ్యాధి దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.