బంగారం ధరలు తగ్గినా, వెండి ధరలు మాత్రం పెరిగాయి


నేడు బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గి వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.340 మేర తగ్గింది.

దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,320కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,700కి పడిపోయింది.

ఢిల్లీలోనూ బంగారం ధరలు ఆలాగే కొనసాగుతున్నాయి. కేవలం రూ.10 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,150కి చేరింది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.890 మేర ధర పుంజుకుంది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,900 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది.