500 ఏళ్ళ కల సాకారం అయింది ..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్



రామ్ ఆలయానికి పునాది రాయి వేయడం గత 500 సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అన్నారు. ఈ ఆలయం రాముడి గొప్పతనాన్ని తెలియపర్చడమే కాకుండా యావత్‌ భారతీయుల గొప్పతనాన్ని తెలియపరుస్తుందన్నారు.

యోగి మాట్లాడుతూ గత 500 సంవత్సరాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరైనందుకు యోగి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని తయారు చేసిన మందిర నిర్మాణ ప్రణాళికను తాము అమలు చేస్తామన్నారు. మోడీ మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ తమకు సహాయకారిగా ఉంటుందన్నారు.

నేడు ఆయోధ్యలో భూమి పూజకు హాజరైనందుకు రాష్ర్ట, దేశ పౌరుల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయోధ్యలో ఒక గొప్ప ఆలయం ఉంటుందని, ఇది ప్రపంచానికి శాంతి, స్నేహాన్ని పంచుతుందన్నారు.