కరోనా వ్యాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఐరాస చీఫ్ సెక్రటరీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. కరోనా ఇప్పటికే కోట్లాది మందికి సోకింది. కరోనా మహమ్మారి వలన ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు.

కరోనా టీకా అందుబాటులోకి వస్తే వైరస్ కు అడ్డుకట్ట వెయ్యొచ్చని అంటున్నారు. అయితే, టీకా అందుబాటులోకి వచ్చినా మహమ్మారిని కట్టడి చేయడం కష్టం అని, అలా భావించడం పిచ్చితనమే అవుతుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.

కరోనామహమ్మారి దశాబ్దాలపాటు కొనసాగుతుందని అన్నారు. శాస్త్రవేత్తలు నిబద్దతతో పోరాటం చేస్తున్నారని అన్నారు. యూకే ప్రభుత్వం ఫైజర్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చిన తరువాత ఆంటోనియో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం