కరోనా వాక్సిన్ పై ట్రంప్ కీలక ప్రకటన


ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. త్వరగా టీకాలు అందుబాటులోకి రావాలని అందరూ కోరుతున్నారు.

ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ వాక్సిన్‌ను విడుదల చేసినప్పటికీ దానిపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో దానిపై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

మరి ఏ వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. అమెరికాలో మూడు వాక్సిన్‌లు ఫైనల్ ట్రయల్ స్టేజిలో ఉన్నాయని ఇప్పటికే టీకా ఉత్పత్తిని ప్రారంభించామని ప్రకటించారు.

లక్షలాది డోస్‌లను సిద్ధం చేస్తున్నామని.. సమర్థవంతమైన వాక్సిన్‌ ఈ ఏడాదే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్.. అందరం కలిసి కరోనా వైరస్‌ను తరిమికొడతామన్నారు.