బతికి ఉన్న మహిళను చనిపోయిందని మార్చురీకి


కొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాల మీదకి వస్తోంది. ఎమర్జెన్సీ కేసుల్ని సైతం సరిగా పట్టించుకోకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. బతికి ఉన్న మహిళను చనిపోయిందని చెప్పిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.

గంగారం గ్రామానికి చెందిన వనపర్తి అమృతమ్మ అనే మహిల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంసబభ్యులు అమృతమ్మను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ నిర్లక్ష్య౦గా వ్యవహరించారని జిల్లా సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. బతికి ఉన్న మహిళను చనిపోయిందని ధ్రువీకరించిన డాక్టర్‌లను వెంటనే సస్పెండ్‌ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజు డిమాండ్‌ చేశారు.

మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌ ఆర్‌ఎం మధుకు వినతిపత్రం అందజేశారు. అమృతమ్మ బతికుండగా ఆమెను చనిపోయిందని ధ్రువీకరించి ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని డాక్టర్లు ప్రవర్తించిన తీరు సరైంది కాదన్నారు.