తెరుచుకోబోతున్న ఆలయాలు


కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని మతాల ఆలయాలు క్లోజ్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మార్చి నెల చివరి వారం నుండి దేశంలో ఉన్న ఏ ఆలయాల తలుపులు కూడా ఇప్పటివరకు తెరుచుకోలేదు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే చోట వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయాలు కూడా కేంద్రం మూసి వేయడం జరిగింది.

అయితే ఇటీవల కేంద్రం చాలావరకు వెసులుబాటు ఇస్తూ కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి అని తెలపటంతో కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఆలయాలు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తద్వారా భక్తులు ఆలయాలు సందర్శించడానికి అవకాశం కలిగించింది. ఈ నిర్ణయంతో దేశంలో ఆలయాలకు అవకాశం ఇచ్చిన తొలి రాష్ట్రంగా కర్నాటక నమోదు అయింది. అయితే ఇదే సమయంలో భక్తులు నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కాగా జూలై ఒకటి నుంచి స్కూళ్లు కూడా కర్నాటకలో ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు.