మాస్కో: తాము అభివృద్ధి
చేసిన కరోనా టీకా ‘స్పుత్నిక్-వీ’ కరోనా వైరస్‌పై 92%
ప్రభావం చూపిస్తున్నట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గత వారం తమ టీకా వైరస్‌పై
90 శాతం
ప్రభావం చూపిస్తున్నదని ఫైజర్, బయోఎన్‌టెక్
ప్రకటించిన నేపథ్యంలోనే రష్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
కరోనా సోకిన 20
మందిపై పరీక్షలు నిర్వహించి వైరస్ సామర్థ్యాన్ని అంచనా వేసినట్టు రష్యన్
డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. స్పుత్నిక్-వీ టీకాను
రష్యా సంస్థ గమాలయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది.
ఇది ప్రస్తుతం మూడో దశ
ట్రయల్స్‌లో ఉ౦ది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే టీకాను విడుదల చేశారని
అప్పట్లో రష్యాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.