జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో జగన్ ప్రభుత్వంను పోలిన పథకం


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోను జగన్ ప్రభుత్వంను పోలిన పథకం అమలు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఓ పథకం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో అమలు చేస్తున్న పథకాన్ని పోలి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది.

ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ఆటోల రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.7000 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, ఆటో డ్రైవర్లకు ప్రమాదబీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో తీసుకొచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.10,000 సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వారికి చెల్లింపులు కూడా చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్‌లైన్‌ చెల్లింపులు చేశారు.