ఆన్లైన్ క్లాసులకు తాజా మార్గదర్శకాలు...


ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్‌ తరగతుల విషయంలో తల్లిదండ్రులు సహకరించాలని కోరింది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రయివేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రయివేటు పాఠశాలు గంటల తరబడి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు విద్యార్థులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్న కారణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. తాజా మార్గదర్శకాలతో పాటు గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా పాటించాలని ఆదేశించారు.

తాజా మార్గదర్శకాలు:

నర్సరీ నుంచి యూకేజీ వరకు రోజుకు 45 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి. వీరికి వారంలో మూడు రోజులు మాత్రమే తరగతులు నిర్వహించాలి.

ఒకటి నుంచి 12 తరగతుల వరకు వారానికి 5 రోజులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి. 1 నుంచి 5 తరగతుల వరకు గరిష్టంగా రోజుకు గంటన్నర సమయం క్లాసులు ఉండాలి. 6 నుంచి 8 తరగతుల వరకు గరిష్టంగా రోజుకు రెండు గంటల సమయం క్లాసులు ఉండాలి.

9 నుంచి 12 తరగతుల వరకు గరిష్టంగా రోజుకు మూడు గంటల క్లాసులు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీ శాట్‌, దూరదర్శన్‌ ద్వారా తరగతులు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో క్లాసులు జరిగేలా డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.