విఫలమైన అమెరికా ఉపగ్రహ ప్రయోగం


న్యూజిలాండ్‌కు చెందిన ఏడు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ప్రయత్నంలో అమెరికన్ ప్రయోగ సంస్థ-రాకెట్ ల్యాబ్ విఫలమైంది. రాకెట్ కక్ష్యలో చేరలేకపోయింది. రాకెట్ ల్యాబ్ తన ఎలక్ట్రాన్ వాహనం నార్త్ ఐలాండ్‌లోని మహియా ద్వీపకల్పం నుంచి ప్రయోగించినప్పుడు విఫలమైంది.

ఈ ఘటనలో అన్ని ఉపగ్రహ పేలోడ్‌లు ధ్వంసమయ్యాయి. ఇదే రాకెట్‌లో అమెరికా, జపాన్, బ్రిటన్‌ ఉపగ్రహాలను కూడా పంపించారు. న్యూజిలాండ్‌కు చెందిన నార్త్‌ ఐల్యాండ్‌లో ప్రైవేటుగా నడుస్తున్న స్పే స్పోర్ట రాకెట్ ల్యాబ్‌లో ఎలక్ట్రాన్ లాంచర్‌ను సిద్ధం చేశారు. కక్ష్యలోకి చేరకముందే కుప్పకూలినట్లు రాకెట్‌ ల్యాబ్‌ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాకెట్ ల్యాబ్ సీఈవో పీటర్ బెక్ ట్విట్టర్‌ వేదికగా తమ వినియోగదారులకు క్షమాపణలు తెలిపారు.

ఉపగ్రహాలను అందించడంలో మేం విఫలమైనందుకు క్షమించాలని వినియోగదారులను కోరుతున్నాను అని పోస్ట్‌ పెట్టారు. త్వరలోనే సమస్యను కనుగొని సరిదిద్దుతాం. వీలైనంత త్వరగా ప్యాడ్‌లోకి వచ్చేందుకు కృషి చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

రాకెట్ ల్యాబ్ ఎగిరే సమయంలో ఏదో ఒక సమస్య ఎదురైంది. అదే వాహనం కూలిపోవడానికి కారణమైందని భావిస్తున్నాం అని సంస్థ పేర్కొంది. రాకెట్‌లో రెండో దశ ఇంధనం మండే సమయంలో ఆలస్యం జరుగడం వల్లనే ప్రయోగం విఫలం చెంది ఉంటుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సంస్థ ప్రకటించింది.