డైలీ ఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌


దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ నుంచి కొన్ని రైళ్లను నడపనున్నారు. ఢిల్లీ, ముంబై, హౌరా, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రముఖ ప్రదేశాలకు జూన్‌ ఒకటి నుంచి రైళ్లను నడుపనున్నది.

ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరో ఏడు రైళ్లు సోమవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. తెలంగాణ, హుస్సేన్‌సాగర్‌, ఫలక్‌నుమా, గోదావరి, రాయలసీమ, ధానాపూర్‌, గోల్కొండ, సచ్‌కండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మొదటి దశలో పునరుద్ధరించనున్నారు. గురువారాల్లో దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా నడుపనున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా ప్రకటించి, వాటి నంబర్లు మార్చినప్పటికీ అవి బయలుదేరే ప్రదేశాలు, చేరుకునే గమ్యస్థానాలు, సమయం లాక్‌డౌన్‌కు ముందున్న రీతిలోనే ఉంటాయి.


రైళ్లు ప్రయాణించే మార్గాల్లో గతంలో హాల్టింగ్‌ ఉన్న అన్ని స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లకు టికెట్లను తెలంగాణలోని అన్ని ప్రముఖ స్టేషన్లలో విక్రయిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. ఈ రైళ్లలో ఏసీ, నాన్‌ ఏసీ తరగతులుంటాయి. తత్కాల్‌, ప్రీమియం తత్కా ల్‌ బుకింగ్స్‌ ఈ రైళ్లకు వర్తించదు. వెయిటింగ్‌ లిస్ట్‌లో పేరు ఉండి టికెట్లు కన్‌ఫర్మ్‌ కాకపోతే ప్రయాణానికి అనుమతించరు.

గమ్యము చేరాక ఆయా రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలి. హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న ఎంఎంటీఎస్‌ సర్వీసు సేవలు మరింత జాప్యం కానున్నాయి. ప్రతీరోజు 121 ట్రిప్పులు నడుస్తూ సుమారు 1.5 నుండి 2 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఎంఎంటీఎస్‌ రైళ్లను ప్రస్తుత పరిస్థితుల్లో నడుపకూడదని నిర్ణయించినది.