బోనాల పండగపై మంత్రి తలసాని అధికారులతో రేపు సమావేశం


ఆషాడ మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది హైద్రాబాద్లో ఘనంగా నిర్వహించే లష్కర్ బోనాలు ..ప్రతి ఏడాది అత్యంత వైభవముగా బోనాల పండగ జరుపుకుంటారు ..తెలంగాణాలో అతి పెద్ద పండుగలలో బోనాలు ఒకటి..అయితే ఈ సారి కరోనా కారణంగా బోనాల పండగ శోభా తగ్గనుంది ..హైదరాబాద్ లో వైరస్ తీవ్రంగా ఉండటంతో ఈ సారి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావొద్దు అని ప్రభుత్వం ఆదేశించింది

ఈనేపధ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సనత్‌నగర్‌నియోజక వర్గం ఎమ్మెల్యే, పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శుక్రవారం అమ్మవారి జాతర నిర్వహణ విషయంపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈసారిజాతరను సంప్రదాయ బద్దంగా ఆలయ ఆవరణలోనే నిర్వహించాలని నిర్ణయించారు.

పూజారులే అమ్మవారికి బోనాలుసమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులనెవరినీ అనుమతించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈసమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఆయల పండితులు, పోలీసు అధికారులు పాల్గొంటారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వచ్చే ఏడాది భారీగా జాతర నిర్వహిస్తామని ఈసందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తెలిపారు.